AP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశ పెట్టారు. అయితే తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు దాటింది. దీనికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలుగా తెలుస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపటానికి వివిధ శాఖలకు భారీగా కేటాయింపులు చేశారు.