రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది: మంత్రి

53చూసినవారు
రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుంది: మంత్రి
AP: రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని, అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బడ్జెట్ అనంతరం ఆయన మాట్లాడారు. 2014-19 మధ్య రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామన్నారు. ప్రధాని మోడీ సహకారంతో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్