రూపోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మోదీ వచ్చాక రూ.15 వేల కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఏడాదీ రూ.12వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. 2026 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. దీంతో 2.91 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, విశాఖతో పాటు 540 గ్రామాలకు తాగునీరు లభిస్తుందని చెప్పారు. 28.5 లక్షల మంది ప్రజలకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.