వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు: పవన్ కళ్యాణ్

76చూసినవారు
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు: పవన్ కళ్యాణ్
వన్యప్రాణుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం పులులపై వార్షిక నివేదికను విడుదల చేసి, నగరవనం లోగోను పవన్ ఆవిష్కరించారు. పులుల సంరక్షణ అంటే కేవలం పులుల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని.. వన్యప్రాణులు, స్థానిక సమాజాలకు ప్రయోజనం చేకూర్చే సామరస్యపూర్వక పర్యావరణ వ్యవస్థను నిర్వహించడమని అన్నారు. ప్రస్తుతం ఏపీలో 50 నగరవనాలు ఉన్నాయని.. మరో 11 నగరవనాలు మంజూరు చేయబడ్డాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్