AP: టౌన్ ప్లానింగ్ సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో దీనిపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. "నాన్ హైరైజ్ భవనాల్లో సెట్‌బ్యాక్ నిబంధనలను సరళతరం చేయాలని నిర్మాణ సంస్థలు కోరాయి. అమరావతిలో 214 చ.కి.మీ పరిధిలో 27 యూనిట్లు ఉన్నాయి. బిల్డర్లు కోరిన మినహాయింపుల్లో కొన్ని సాధ్యం కావని చెప్పాం. లైసెన్స్ సర్వేయర్ల ఫీజు ఒక్క రూపాయిగా నిర్ణయించాం" అని మంత్రి తెలిపారు.