ఏపీలో ఉచిత ఇసుక పాలసీలో సీనరేజ్ ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక పాలసీపై ఈ నెల 21న భేటీలో నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఫీజు చెల్లించకుండా నిర్మాణ అవసరాలకు ఇసుక తీసుకెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లభ్యత పెంచేలా పాలసీలో మార్పులు చేశారు. ఇసుక లభ్యం కానీ జిల్లాల్లో స్టాక్ యార్డులు ఏర్పాటు చేయనున్నారు.