మీ అందరికీ ధన్యవాదాలు: అమిత్‌ షా

74చూసినవారు
మీ అందరికీ ధన్యవాదాలు: అమిత్‌ షా
గత ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వానికి అనూహ్య విజయం అందించిన అందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ సమీపంలోని కొడపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏవిధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే. అప్పుడు జరిగిన విధ్వంసం గురించి చింతించకండి. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తాం’’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్