AP: రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. NDRF ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టానికి కేంద్రం మూడింతల సాయాన్ని అందిస్తుందని తెలిపారు. కూటమి సర్కార్ ఏర్పడ్డాక రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 2028 నాటికి పోలవరం ద్వారా రాష్ట్రం మొత్తానికి నీరు సరఫరా అవుతుందని చెప్పారు.