రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పట్ల ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. చదువు పేరుతో వారిని ఒత్తిడికి గురి చేయొద్దని సూచించారు. కాగా, ఈ ఏడాది 17 రోజుల వ్యవధిలోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.