ఏపీలో డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మైనారిటీ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత డీఎస్సీ శిక్షణకు అర్హులైన మైనారిటీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు ఎస్.కె.ఫర్జానా బేగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి WWW.apcedmmwd.org వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.