ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల్లో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రూ.85,520 కోట్ల లాభం వచ్చినట్లు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 53 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో రూ.2.37 లక్షల కోట్లు డిపాజిట్ ఉన్నట్లు తెలిపారు. ఒక్కో ఖాతాలో సగటు బ్యాలెన్స్ 2014లో రూ.1,065 ఉండగా.. ప్రస్తుతం రూ.4,397కి పెరిగినట్లు వివరించారు.