కింగ్‌ఫిషర్ ప్రీమియం బీర్ భారతదేశంలో నెం.1 బీర్ బ్రాండ్‌గా అవతరించింది. ఈ కింగ్‌ఫిషర్‌ను యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ తయారు చేసింది. భారతదేశంలో దీన్ని ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. దీనిని 1978లో ప్రారంభించబడింది. దాదాపు 5 దశాబ్దాలు గడుస్తున్నా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికీ చాలామంది మందుబాబుల ఫేవరెట్ డ్రింక్‌గా నిలుస్తోంది. ఈ బీర్ ఇప్పుడు భారతదేశం కాకుండా 60 కంటే ఎక్కువ దేశాల్లో అమ్ముడవుతోంది.