TG: ఇంటర్ కాలేజీలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం దారుణమని, ఆ కాలేజీలపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ర్యాంకుల పేరిట మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలని హెచ్చరించారు. విద్యార్థులకు ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ ఉంటే 8688007954కు కాల్ చేయాలని లేదా minister.randbc@gmail.com మెయిల్ చేయాలన్నారు.