జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏపీ విద్యార్థుల సత్తా

70చూసినవారు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఏపీ విద్యార్థుల సత్తా
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. టాప్-10లో నలుగురు చోటు దక్కించుకున్నారు. నంద్యాల జిల్లాకు చెందిన భోగలపల్లి సందేశ్ 360కి 338 మార్కులతో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు పొందాడు. కుశాల్ కుమార్ 332 (అనంతపురం), తేజేశ్వర్ 331 (కర్నూలు), సుహాన్ 326 (తూర్పు గోదావరి) మార్కులతో జాతీయ స్థాయిలో 4, 8, 10 ర్యాంకులతో మెరిశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 12 వేల మంది అర్హత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్