‘ఆత్మార్పణ దినం’.. ప్రభుత్వం కీలక నిర్ణయం

76చూసినవారు
‘ఆత్మార్పణ దినం’.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ 15వ తేదీని ఏటా ‘ఆత్మార్పణ దినం’గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. ఆయ జీవిత విశేషాలపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్విజ్ నిర్వహించాలంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్