AP: గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌పై దాడి ఘటన అధికార పార్టీలో కలకలం రేపింది. గుంటూరు 1వ డివిజన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని టీడీపీ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, అతని సోదరుడు ఫైరోజ్ ఎమ్మెల్యేను నిలదీశారు. వారిని ఎమ్మెల్యే హెచ్చరించడంతో కాలర్ పట్టుకుని దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకు రక్షణ కల్పించారు. ఎమ్మెల్యే స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.