సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి

80చూసినవారు
సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
AP: మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచార‌ణకు హాజ‌ర‌య్యారు. చంచల్‌గూడ జైలులో ఉన్న మరో నలుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపర్చారు. కాగా, ఈ కేసుకు సంబంధించి అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను ఇటీవల తెలంగాణ హైకోర్టు కొట్టేసిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత పోస్ట్