ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా అతి తక్కువ ధరకు నాణ్యమైన మద్యం విక్రయించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అద్దంకి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని వైన్ షాప్ లో సోమవారం 99 రూపాయల క్వాటర్ మద్యం బాటిల్ దర్శనం ఇచ్చాయి. ఎమ్మార్పీ ధరకే విక్రయాలు కొనసాగిస్తూ ఉండటంతో మందుబాబులు ఆ మద్యాన్ని కొనేందుకు ఉత్సాహం చూపారు.