అద్దంకి మండలం గోవాడ గ్రామంలో శనివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో 10 లక్షల అంచనా తో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అలాగే మినీ గోకులం షెడ్లను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మంత్రి రవికుమార్ ని కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు.