విశాఖ లంకెలపాలెం వద్ద విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లంకెలపాలెం సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనదారుడిని బలంగా ఢీకొంది. దీంతో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైను కార్ల వెనుక భాగంలో బస్సు బలంగా ఢీకొనడంతో కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి పరవాడ పోలీసులు చేరుకొని గాయపడిన వారిని అగనంపూడి ప్రభుత్య హాస్పిటల్‌కు తరలించారు.