సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో రైళ్లు, బస్సులు ఫుల్ రద్దీగా ఉన్నాయి. స్పెషల్ బస్సులు, రైళ్లు వేసిన నిమిషాల్లోనే బుక్ అయిపోతున్నాయి. దీంతో విమాన టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు టికెట్ ధర రూ. 3 నుంచి 4 వేల వరకు ఉంటుంది. కానీ సంక్రాంతికి ఒక్కసారిగా టికెట్ ధర రూ. 17,500 వరకు పెరిగింది. అయినప్పటికీ సొంతూళ్లకు వెళ్లాలనే ఆశతో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.