ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తమ ఉద్యోగుల పదవీ విరమణ వయసులో కీలక మార్పు చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచినట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ అంతర్గత మెమో ద్వారా ఉద్యోగులకు తెలియజేసినట్లు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. ఈ మార్పు భారత్‌లోని కాగ్నిజెంట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ వర్తిస్తుందని సమాచారం. అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను మరింత సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.