అద్దంకి పట్టణంలో స్థానిక లాయర్ కార్యాలయం నందు బుధవారం నూర్ భాషా, దూదేకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూర్ భాషా, దూదేకుల పట్టణ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ రఫీ పాల్గొని జనగర్జన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. పెందుర్తిలో ఈనెల 20, 21 తేదీలలో ఈ కార్యక్రమం జరుగుతుందని మహమ్మద్ రఫీ చెప్పారు. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.