కొరిశపాడు మండలం మేదరమెట్లలో నూతనంగా నిర్మించిన ఎం.ఆర్ పెట్రోల్ బంకు యజమాని రాఘవ, తన కస్టమర్ల కోసం రూ.. 300 పైగా పెట్రోల్ కొనుగోలు చేసిన వారికి "లక్కీ డ్రా" ను ప్రకటించారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం "లక్కీ డ్రా" లో గెలుపొందిన విజేతలకు బహుమతులను గ్రామ టిడిపి సీనియర్ నాయకులు సింగంనేని వాసు చేతుల మీదుగా అందజేశారు. కాగా లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా రూ..10116 మూకర. నరేంద్ర, రెండవ బహుమతి రూ. 5116 పంచేటి. కృష్ణ కైవసం చేసుకున్నారు.