గుంటూరులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే మాల మహా గర్జనకు ఆదివారం అద్దంకి నుండి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మాలలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. తొలుత పోరాట సమితి అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.