వేద గ్రంధాలలో తులసి మొక్కను లక్ష్మీ కటాక్షంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా ఇంట్లోకి సంపద, సంతోషం వస్తాయని పండితులు చెబుతుంటారు. అయితే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే గర్వం వస్తోందని గ్రంధాలు చెబుతున్నాయి. ఇంట్లో ఎక్కువ సంఖ్యలో తులసి మొక్కలు నాటాలంటే 3,5,7 అనే సంఖ్యల్లో నాటడం మంచిదని వివరిస్తున్నారు.