చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 36.75 లక్షలు కేటాయించిందని శనివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. మురికిపూడి సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహానికి రూ. 12.65 లక్షలు, చిలకలూరిపేట సాంఘిక సంక్షేమ వసతి గృహానికి రూ. 10.75 లక్షలు కేటాయించామన్నారు. నాదెండ్లలోని సాంఘిక సంక్షేమ వసతి గృహానికి రూ. 13.35 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు.