ఆపన్నులకు దైవజనులు ఎప్పుడూ అండగా నిలుస్తారని ఇవాంజెలిస్ట్ బ్రదర్ యడం రవిశంకర్ చెప్పారు. విజయవాడ వర్ష బాధితులకు చీరాల పాస్టర్స్ అసోసియేషన్ గురువారం ఎమ్మెల్యే మాలకొండయ్య ద్వారా నిత్యావసరాలను పంపారు. ఈ సందర్భంగా పాస్టర్ల సేవా నిరతిని ఎమ్మెల్యే కొనియాడారు. మంచి కార్యక్రమాలకు యడం రవిశంకర్ ఎప్పుడూ ముందు ఉంటారని ఆయన అభినందించారు. పాస్టర్లు రాజేష్, దాస్, పాల్, లూధర్ శాస్త్రి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.