చీరాల రూరల్ దేవాంగ పురి గ్రామ పంచాయతీ నందు పంచాయతీ సెక్రటరీ బండారు మురళి బాపూజీ ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రెటరీ బాపూజీ మాట్లాడుతూ భారతదేశ మాతృభూమి కోసం తన ధన, మన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులకు ధన్యవాదాలు అని, అటువంటి వారిలో జాతిపిత మహాత్మా గాంధీ , నేతాజీ సుభాష్ చంద్రబోస్, మొదలగు వారి త్యాగం ఫలితంగా ఫలితంగా ఈ రోజున స్వాతంత్ర ఫలితాలు అందినవి అనీ కొనియాడారు.