డ్రగ్స్ రహిత సమాజం యువత వల్లే సాధ్యమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. దేశ భవిషత్తు యువత పై ఆధారపడి ఉంటుందని, వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా చీరాలలో బుధవారం సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల గురించి విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.