ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో నూతనంగా వీధిలైట్లను ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వీధిలైట్లను గురువారం దర్శి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ మేయర్ నారపు శెట్టి పిచ్చయ్య స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.