గుంటూరు: పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

73చూసినవారు
రాష్ట్రానికి పెట్టుబడుల వరద ఒకవైపు ఉంటే అభివృద్ధి మరోవైపు పరుగులు పెడుతుందని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారము శంకుస్థాపన చేసిన ఆయన గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన అభివృద్ధిని పట్టాలెక్కించింది కూటమి ప్రభుత్వమన్నారు. నగరాభివృద్ధికి పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, సజీలా, సమత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్