ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం హర్షదాయకమని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయంలో ఒక ముందడుగు పడిందన్నారు. కృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన ఉద్యమం వర్గీకరణ విషయంలో కీలక మలుపుకు దారి తీసిందని చెప్పారు. ఈ తీర్పుతో భారత రాజ్యాంగం మాత్రమే గెలిచిందని స్పష్టం చేశారు.