గుంటూరులో మాలల గర్జన సందర్భంగా ర్యాలీలు

51చూసినవారు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆదివారం మాలలు చేపట్టిన గర్జన విజయవంతమైంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి మాల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరంలో భారీ ర్యాలీ చేపట్టి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాల మహానాడు నాయకులు వెంకటరమణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్