గుంటూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం

55చూసినవారు
గుంటూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం
గుంటూరులోని ఆర్టీసీ బస్టాండ్ లో గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో చేబ్రోలు అఖిల్ (22) అనే విద్యార్థి మృతి చెందాడు. అఖిల్ బస్సు ఎక్కే క్రమంలో కాలు జారీ బస్సు వెనక చక్రం క్రింద పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అఖిల్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా అప్రెంటిస్ చేస్తున్నట్లు మృతుడు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్