గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వద్ద స్టెచ్చర్పై సోమవారం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్టెచ్చర్పై ఉన్న వ్యక్తిని సెక్యూరిటీ సూపర్వైజర్ మల్లిఖార్జునరావు గుర్తించి వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే వ్యక్తి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చూరీలో భద్ర పర్చామని, వివరాలు తెలిసిన వారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు.