గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ జెండాని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు గురువారం ఆవిష్కరించారు. అనంతం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధులను నేటితరం యువత స్పూర్తిగా తీసుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తదితరుల పాల్గొన్నారు.