జగన్ జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అదే పరంపరను కొనసాగించి రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. గుంటూరు శ్రీనివాసరావు పేట లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మాధవి మాట్లాడారు. జగన్ భారీగా రూ. వేలకోట్ల ముడుపులు తీసుకున్నారని అమెరికా అభియోగం మోపటమే జగన్ అవినీతికి సాక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. అటువంటి వారిని చట్టాలు కఠినంగా శిక్షించాలన్నారు.