గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్ విఐపి రోడ్లో కమ్యూనిటీ హాల్ వద్ద సోమవారం సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో తన కృషి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.