ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫైనాన్షియల్ కమిటీలకు సభ్యుల ఎన్నికలలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి శుక్రవారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలోని శాసనసభ కమిటీ హాల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు శాసనసభ కమిటీల క్రియాశీలతను పెంపొందించేందుకు కీలకమైనవి భావిస్తున్నానన్నారు.