డిసెంబర్ 8న జరగనున్న జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తు గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి పి. శైలజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మన్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ, కుటుంబ వార్షికాదాయం రూ. 3. 50 లక్షలలోపు ఉన్న వారు అర్హులని తెలిపారు.