గుంటూరు టౌన్-2 సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ సుబ్బరాయుడు తెలిపారు. గుంటూరు లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వినియోగదారులు గమనించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.