

దాచేపల్లి: యార్డులో నిలిచిన మిర్చి కొనుగోలు
దాచేపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలును దళారులు ఆదివారం నిలిపివేశారు. తాత్కాలికంగా కొనుగోలు నిలిపివేశామని వ్యాపారులు చెప్తున్నారు. మిర్చి ఎగుమతి దారులకు దిగుమతి దారుల మధ్య వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ పరిస్థితి వచ్చిందని యార్డ్ వర్గాలు తెలిపాయి. గురజాల నియోజకవర్గంలో పాటు పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మిర్చిని యార్డుకు తరలించిన రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు.