

గురజాల: గుంతలకు తారుతో మరమ్మతులు
గురజాల-మాడుగులకు వెళ్లే రహదారిపై ఉన్న గుంతలకు గత 20 రోజుల నుంచి గుల్ల, తారును కలిపి గుంతలు పూడ్చి ప్యాచ్ వర్క్ పనులు చేపట్టారు. గురజాల-మాడుగుల రహదారిలో స్కూల్ బస్సులు, ఆటోలు, బైకులు, ట్రాక్టర్లు పలు వాహనాలు గతంలో ప్రయాణం చేయాలంటే గుంతలు అధికంగా ఉండడంతో అనేక ఇబ్బందులకు గురయ్యామని వాహనదారులు తెలిపారు. రహదారిపై ఉన్న గుంతలు పూడ్చివేయడంతో ప్రయాణం చేయడం సులువుగా ఉంటుందని వారు ఆదివారం తెలిపారు.