దాచేపల్లిలో ప్రజలు మంచినీరు తాగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. గురజాలలో ఈరోజు నీళ్లు కూడా లేని దుస్థితి ఏర్పడిందన్నారు. గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. జిల్లాలో టీడీపీ నేతలకు వైన్, ఇసుక మీద ఉన్న శ్రద్ధ మంచినీళ్ల మీద లేదన్నారు. మంచినీరు ఇవ్వడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు.