4నెలల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని కోరుతూ. దాచేపల్లి మండలంలోని ఓ సిమెంట్ కర్మాగారంలోని కార్మికులు, సూపర్వైజర్లు, సబ్ కాంట్రాక్టర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. జీతాలు ఇవ్వాలని యాజమాన్యాన్ని పలుమార్లు అడిగినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. పని వేతనం మీదనే తమ రోజువారి జీవితం ఆధారపడి ఉందన్నారు. యాజమాన్యం స్పందించి తమ జీతాలు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.