పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడి అమరుడైన కామ్రేడ్ బరిసె కోటయ్య సంస్మరణ సభ దుర్గి మండలం అడిగోప్పల గ్రామంలో సోమవారం వివిధ ప్రజాసంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు.కామ్రేడ్ బరిసె కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. విప్లవ రాజకీయాల ప్రేమికుడైన కామ్రేడ్ బరిసె కోటయ్య తన చివరి శ్వాస వరకు పీడిత ప్రజల పక్షాన నిలబడి, దోపిడీ వర్గాలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయ్యాడని కొనియాడారు.