మాచర్ల పట్టణంలోని 13వ వార్డుకు చెందిన సత్యనారాయణ(47)బుధవారం అనారోగ్యానికి గురై శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. మొదట పలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎక్కడా ఆక్సిజన్ (ప్రాణవాయువు) సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. సిబ్బంది ఆక్సిజన్ మాస్క్ లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితుడి కుమార్తెలు తెలిపారు. మాస్క్ తెచ్చేందుకు బయటికి వెళ్లి వచ్చేసరికి సత్యనారాయణ చనిపోయాడని చెప్పారు.