దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్, మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం గురువారం అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ , ఎస్పీ సమక్షంలో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తన సేవలను గుర్తించి ప్రశంసాపత్రం, అవార్డు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.