మాచర్లకు ఈనెల 15న సింగిల్ గా వస్తానని, దమ్ముంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు దాడి చేయాలని మంగళవారం తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. తాను తలుచుకుంటే 1000 కార్లతో వెళ్లగలనని, అయితే సింగిల్గా వెళ్లి, గురజాల డీఎస్పీని కలిసి వస్తానన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తమ పోరాటం ఆగదన్నారు. తనపై చేసిన హత్యాయత్నానికి తగిన శిక్ష మాజీ ఎమ్మెల్యేకి ఉంటుందన్నారు.